మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ వచ్చింది. మొదటి వారంలో ఆచార్య 43.98కోట్లు షేర్ తో డిజాస్టర్ ఫలితం మూటగట్టుకుంది. మెగాస్టార్ సినిమా ఫస్ట్ వీకెండ్ షేర్ 43.98కోట్లు అంటే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ కిందే లెక్క. మెగాస్టార్ గత చిత్రం సైరా సినిమా ఒక్కరోజు కలెక్షన్ కి ఇది సమానం. ఇది కేవలం మెగాస్టార్ సినిమానే కాదు.. చరణ్ కూడా తోడయ్యారు. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియాలో ఇంకా సందడి చేస్తుంది. చరణ్ క్రేజ్ కూడ ఆచార్యని కాపాడలేకపోయింది. దర్శకుడు కొరటాల శివ సినిమాలు స్లోగా మొదలై మళ్ళీ అందుకుంటాయనే నమ్మకం ఒకటి వుండేది. కానీ వీకెండ్ రిపోర్ట్ చూశాక.. ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి. మొత్తానికి చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య పేలవమైన సినిమాగా మిగిలిపోయింది.
ఈ సినిమా కోసం దాదాపు 160 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. ఇందులో వడ్డీలే 40 కోట్ల వరకూ ఉంటాయి. చిరుకి దాదాపుగా 50 కోట్లు పారితోషికం ఇచ్చారు. చరణ్ నిర్మాత అయినా పేరుకి మాత్రమే అని, అంతా మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చూసుకుందని, కొరటాల శివ కూడా తన పారితోషికం బదులుగా.. వాటా తీసుకున్నాడని, తన పెట్టుబడి కూడా ఈ సినిమాలో చాలా వరకూ ఉందని సమాచారం.