టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా పాపులర్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా మంచి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి కొన్ని సినిమాలు. మార్చ్ నెలలో టాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్స్ రీ రిలీజ్ కానున్నాయి. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరో ఉదయ్ కిరణ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఉదయ్ కిరణ్ కెరియర్ ప్రారంభంలో అన్ని సూపర్ డూపర్ హిట్లే. పెద్ద పెద్ద స్టార్ వారసులకు కూడా దక్కని హిట్స్, ఆదరణ ఉదయ్ కిరణ్ కి దక్కింది. అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోన్నాడని టాక్. మొదటి సినిమా చిత్రంతో యూత్ కి బాగా కనెక్టయ్యాడు. రెండో సినిమా నువ్వు నేనుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ మనసంతా నువ్వే, శ్రీ రామ్, నీ స్నేహం అన్నీ హిట్లే. తక్కువ కాలం లోనే స్టార్ హీరో హోదా అందుకున్నాడు ఉదయ్. తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన తరవాత కెరియర్ డౌన్ అయ్యి, సూసైడ్ చేసుకున్నాడు.
ఉదయ్ కిరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన నువ్వు నేను సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేయాలనుకుంటున్నారంట. 2001 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన నువ్వునేను మూవీ థియేటరలో విడుదలైంది. ఇప్పుడు రీ రిలీజ్ ద్వారా ఉదయ్ కిరణ్ ని స్మరించుకున్నట్లు ఉంటుందని, మరల డిజిటలైజ్ చేసి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. నువ్వు నేను సినిమా అప్పటిలో యూత్ కి బాగా చేరువ అయ్యింది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది. మార్చి నెలలో ఈ మూవీ రీ రిలీజ్ అవ్వనున్నట్లు టాక్. నువ్వు నేను మూవీలో అనిత హీరోయిన్ కాగా, తేజ దర్శకత్వం వహించారు. RP పట్నాయక్ సంగీతం సమకూర్చారు.
ఇదొక్కటే కాదు ఏప్రిల్ లో మనసంతా నువ్వే కూడా రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మనసంతా నువ్వే సినిమాలో రీమా సేన్, హీరోయిన్ గా నటించింది. వి. ఎన్.ఆదిత్య తెరకెక్కించారు. ఈ మూవీ కి కూడా ఆర్ఫీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ రావాలని ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఉదయ్ కిరణ్ భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.