బాలకృష్ణ- ఈ పేరు వింటే చాల మంది గుర్తొచ్చే మరో పేరు భోళా బాలయ్య. ఆయనకి నచ్చితే ఏదైనా చేయడం నచ్చకపోతే వెంటనే చెప్పేయడం ఆయనకే చెల్లింది.
ఇక ఆయనని గురించిన ఒక విషయాన్ని ప్రముఖ యాంకర్ ఉదయభాను ఒక డ్యాన్స్ షోలో అందరితో పంచుకుంది. తన జీవితంలో ఒక అపూరూప కానుక తన కవల పిల్లల అని ఇక వాళ్ళ తొలి పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని చాలామందిని ఆహ్వానించినా ఎవరు రాలేదు అని ఒక్క బాలకృష్ణ గారు మాత్రం ఒక చిన్న మెసేజ్ పెట్టగానే ఫంక్షన్ కి వచ్చారు అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఫంక్షన్ లో కూడా అంతాతానై తనకి పెద్ద దిక్కుగా వ్యవహరించాడు అని తన మనసులోని సంతోషాన్ని వెలిబుచ్చింది. అందుకే బాలకృష్ణ గారు అంటే తనకి బాగా గౌరవం అని చెప్పింది.