బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. వారం వారం ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. గత వారం సరయూ ఎలిమినేట్ అయ్యింది. రెండో వికెట్...ఉమాదేవిదే. ఈ వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది. ఉమాదేవి ఎలిమినేషన్ ఎవరికీ ఆశ్చర్యానికి గురవ్వలేదు. ఎందుకంటే... ఉమాదేవి ఈ బిగ్ బాస్ హౌస్లో ఎన్నో రోజులు ఉండదని... ప్రేక్షకులు గెస్ చేస్తూనే వచ్చారు. ఆమె కోసం, బిగ్ బాస్ హోస్లో ఆమె ప్రవర్తన, బూతులు తిట్టడం ఇవన్నీ ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. అందుకే ఆమెకు అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. దాంతో.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయాల్సివచ్చింది.
హౌస్ నియమాల్ని ఉమాదేవి సరిగా పాటించలేదని, తోటి కంటెస్టెంట్లతో ఆమె ప్రవర్తించిన విధానం సరిగా లేదని, పైగా ఆమె వాడే భాష కూడా సవ్యంగా లేదని... నెటిజన్లు చెబుతున్నారు. ఆమె దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అదే ఆమెకు నెగిటీవ్ గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి వచ్చే వారం ఈ హోస్ నుంచి ఎవరు బయటకు వస్తారో చూడాలి.