నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓ ఓటీటీ ఛానల్ లో హోస్ట్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అదే `అన్ స్టాపబుల్`. ఆహాలో ఈ కార్యక్రమాన్ని ఈ దీపావళి నుంచి చూడొచ్చు. బాలయ్య హోస్ట్ అనగానే... ఈ షో పై ఇంట్రస్ట్ పెరిగింది. తొలి ఎపిసోడ్ కి మంచి ఫ్యామిలీతో చిట్ చాట్ చేయబోతున్నాడు బాలయ్య. ఈ సందర్భంగా కొన్ని పొలిటికల్ ప్రశ్నలు... కాక రేపబోతున్నాయని తెలుస్తోంది. ఆదివారం.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల చేశారు. అందులో బాలయ్య ఎనర్జీ చూస్తుంటే ముచ్చటేస్తోంది. మోహన్ బాబు కుటుంబానికీ బాలయ్యకూ మంచి రాపో ఉంది. దాంతో స్క్రీన్ వారిద్దరి కెమిస్ట్రీ ఇంకాస్త బాగా పండింది.
మోహన్ బాబుని ఉద్దేశించి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు బాలయ్య. అందులో `ఎన్టీఆర్ ని వదిలేసి ఎందుకు చంద్రబాబు నాయుడు పక్షంలోకి వెళ్లారు` అన్నది ఒకటి. అప్పట్లో ఎన్టీఆర్ కి విధేయుడిగా ఉన్న మోహన్ బాబు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయడం రాజకీయంగా షాక్ కి గురి చేసింది. అదెందుకు? అన్నది ఇప్పుడు మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వినొచ్చు. అయితే ఇక్కడ బాలయ్యని మోహన్ బాబు ఓ ప్రశ్న అడిగారు. `ఎన్టీఆర్ చనిపోయాక.. పార్టీ పగ్గాలు ఎందుకు అందుకోలేదు` అని. దానికి బాలయ్య ఎలాంటి సమాధానం చెప్పాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి తొలి ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా మొత్తం ఎపిసోడ్ ని ఆహాలో చూడొచ్చు.