Unstoppable 2: టీజ‌ర్ ఏంటి ఇంత చ‌ప్ప‌గా ఉంది..?!

మరిన్ని వార్తలు

అన్ స్టాప‌బుల్ 2లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌గానే అంద‌రిలోనూ అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ సీజ‌న్ మొత్తానికి రికార్డులు బ్రేక్ చేసే ఎపిసోడ్ ఇదే అవుతుంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ లెక్క‌లేసుకొన్నారు. ఇప్పుడు టీజ‌ర్ వ‌చ్చింది. అయితే టీజ‌ర్ లో మెరుపులేం క‌నిపించ‌లేదు. సాధార‌ణ ఇంట‌ర్వ్యూల‌లో ప‌వ‌న్‌కి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌లే ఇక్క‌డా ఎదురైన‌ట్టు కనిపించింది. అభిమాన గ‌ణాన్ని ఓట్లుగా ఎందుకు మార్చుకోలేక‌పోయారు? అనే ప్ర‌శ్న ప‌వ‌న్‌కి ఇది వ‌ర‌కే చాలా సార్లు ఎదురైంది. దానికి ప‌వ‌న్ కూడా స‌మాధానం చెప్పేశాడు. ఇప్పుడు అన్ స్టాప‌బుల్ లోనూ అదే ప్ర‌శ్న ఎదురు కావ‌డం చూస్తే.. అన్ స్టాప‌బుల్ టీమ్ ద‌గ్గ‌ర ఇంత‌కంటే మంచి ప్ర‌శ్న‌లు లేవా? అనిపిస్తోంది.

 

న‌న్ను బాలా అని పిలవాలి.. అనేది ప్ర‌తీ హీరోకి బాల‌య్య పెట్టే కండీష‌న్‌. ఇక్క‌డా అదే వినిపించింది. చిరు నుంచి నేర్చుకోవాల‌నుకొన్న విష‌యాలు, వ‌ద్ద‌నుకొనే అంశాల‌పై ఓ ప్ర‌శ్న ఉంది. అది కూడా రొటీన్ ప్ర‌శ్నే. ప‌వ‌న్ ఏం చెబుతాడా? అనే షాకింగ్ ప్ర‌శ్న‌లు, స‌మాధానాలూ.. ఈ టీజ‌ర్‌లో క‌నిపించ‌లేదు. చూస్తుంటే.. ప‌వ‌న్ - బాల‌య్య ఎపిసోడ్ మిస్ ఫైర్ అయ్యిందేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మూడు పెళ్లిళ్ల విష‌యంలో ప‌వ‌న్‌ని బాల‌య్య ప్ర‌శ్నిస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఆ ప్ర‌శ్న ఉండి ఉంటే.. ఈ టీజ‌ర్ పేలేది. కానీ ఆ ప్ర‌శ్న లేకుండానే టీజ‌ర్ విడుద‌ల చేశారు. షోలో అయినా అడిగారో.. లేదో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS