బాలకృష్ణ `అన్ స్టాపబుల్` ఆహాకు కొత్త ఊపిరి తీసుకొచ్చింది. ఈ షో సూపర్ హిట్ అవ్వడం.. ఆహాకి ప్లస్ పాయింట్ గా మారింది. బాలయ్యలోని కొత్త యాంగిల్ ని ఈ షో తీసుకొచ్చిందని అభిమానులు చెబుతుంటారు. ఇప్పుడ సీజన్ 2 మొదలు కానుంది. ఈ సీజన్‌లో మరిన్ని మెరుపులు ఉండబోతున్నాయని ఆహా ముందే హింట్ ఇచ్చేసింది.
అన్ స్టాపబుల్ 2 సీజన్ అక్టోబరులో మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆహా ఫిక్సయ్యింది. అందుకే పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లను జాయింట్‌గా ఈ షోకి ఆహ్వానించాలని చూస్తోంది. పవన్, త్రివిక్రమ్, బాలయ్యను ఒకే వేదికపై చూడడం అభిమానులకు థ్రిల్లింగ్ గా ఉంటుంది.
పవన్ - త్రివిక్రమ్‌లు ఒకే ఇంటర్వ్యూలో కనిపించడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. ఈ కాంబోని సెట్ చేయగలిగితే అన్ స్టాపబుల్ 2 సీజన్‌కు గ్రాండ్ ఓపెనింగ్ దక్కినట్టే.చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. వీళ్లెవరూ సీజన్ 1లో కనిపించలేదు. వాళ్లూ ఈ సీజన్‌లో మెరిసే అవకాశం ఉంది.