బాలీవుడ్ లో ఓ సంప్రదాయం ఉంది. ఓ సినిమా విడుదల అవుతోంటే.. ఆ సినిమాకి పనిచేసిన హీరో, హీరోయిన్ల గురించి ఓ పుకారు పుట్టిస్తారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారనో, డేటింగ్ చేస్తున్నారనో, ఒకరంటే ఒకరికి పడదనో.. గాసిప్పులు సృష్టిస్తారు. దాంతో.. ఆయా సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుందని ఓ నమ్మకం. ఇది ఓ పబ్లిసిటీ ట్రిక్. ఇప్పుడు ఆ ట్రిక్‌లోకి... ప్రభాస్ ని కూడా లాగేస్తున్నారు.
ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్. అక్కడ `ఆదిపురుష్` సినిమా చేస్తున్నాడు. ఇందులో కృతిసనన్ హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పనిలో పనిగా..పబ్లిసిటీ కార్యక్రమాలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈలోగా.. ప్రభాస్ - కృతిలపై ఓ రూమర్ వదిలారు. వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని, ఇద్దరి మధ్యా సమ్‌థింగ్ - సమ్‌థింగ్ నడుస్తోందన్నది ఆ గాసిప్పుల సారాంశం.
ముంబై మీడియా ఈ డేటింగ్ వార్తలను వండి వారుస్తోంది. దాంతో.. `ఆదిపురుష్` ప్రమోషన్లు హాట్ హాట్ గా మొదలైపోయినట్టైంది. ఇలాంటి గాసిప్పులు బాలీవుడ్ లో కొత్తేం కాదు. అయితే మామూలు కమర్షియల్ సినిమాల వరకూ ఇలాంటి ప్రేమాయాణాల పై పుకార్లు సృష్టించినా ఫర్వాలేదు. అయితే `ఆదిపురుష్`లాంటి సినిమాలకు కూడా ఈ అడ్డదారులు తొక్కడం ఎందుకో అర్థం కావడం లేదు.