రామ్ చరణ్ భార్య ఉపాసన ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఫాలోవర్. ఆయన చేపట్టే చాలా కార్యక్రమాలకు హాజరౌతుంటారు. ప్రసంగాల్లో ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. గతంలో జీవితంలో పిల్లల ప్రాధాన్యత గురించి అడిగిన ప్రశ్న వైరల్ అయ్యింది. తాజాగా ఉపాసన , జగ్గీ వాసుదేవ్ తో దిగిన ఫొటోను అభిమానుల కోసం షేర్ చేశారు.
దీనికి ఉపాసన రాసిన కాప్షన్ మాత్రం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. సద్గురు, ఆయన కుమార్తె రాధే జగ్గీతో దిగిన ఫొటో షేర్ చేసిన ఉపాసన.. ‘‘కుమార్తెలతో సద్గురు. ఒకరు సొంత కుమార్తె అయితే.. మరొకరు దత్త పుత్రిక ’’ అని రాశారు. ఇటీవల ఉపాసన తాతయ్య.. అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలకు సద్గురు, ఆయన కుమార్తె హాజరైనట్లు తెలిపారు ఉపాసన.