‘ఉప్పెన’: కథలో అసలు ట్విస్ట్‌ ఇదేనట.?

మరిన్ని వార్తలు

గొప్పింటి అమ్మాయి.. పేదింటి అబ్బాయి కాంబినేషన్‌లో గతంలోనే చాలా సినిమాలు తెరకెక్కాయి. అయితే, ఈ ఫార్ములా సక్సెస్‌ అయిన సందర్భాల కన్నా, ఫెయ్యిూర్‌ అయిన సందర్భాలే ఎక్కువ. ఇదే కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉప్పెన’ ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇంతవరకూ విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అయితే, తీరు చూస్తుంటే, సినిమాలో ఏదో శాడ్‌నెస్‌ దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా క్లైమాక్స్‌ని శాడ్‌గా ముగిస్తారేమో అని తమకున్న సినీ అనుభవంతో ఆడియన్స్‌ గెస్‌ చేస్తున్నారు. కానీ, ఎవరి ఊహలకూ అందని విధంగా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని చిత్రయూనిట్‌ చెబుతోంది.

 

ఈ సినిమాకి బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అందించిన సంగతి తెలిసిందే. ఎన్నో చూసేసిన ఆయన ఆడియన్స్‌ గెస్‌కి అందుకునేలా కథని ఎందుకు ముస్తాబు చేస్టారు.? అలాగే, మూస కథలు అస్సలు ఒప్పుకోని విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో ఖచ్చితంగా ఎవ్వరి ఊహకూ అందని విధంగానే ఈ సినిమా కథ ఉంటుదనుకోవాలి. ఇంతవరకూ విడుదలైన ప్రోమోస్‌ ద్వారా కేవలం ఇదో క్యూట్‌ లవ్‌ స్టోరీ అని మాత్రం తెలుస్తోంది. కానీ, అన్నింటికన్నా ఆసక్తికరమైన కథాంశం దాగుందట. సినిమా చూసే వరకూ అది మాత్రం రివీల్‌ అయ్యే ఛాన్సే లేదంటున్నారు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మైత్రీమూవీస్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS