2021లో టాలీవుడ్ చూసిన అతి పెద్ద విజయాలలో ఉప్పెన ఒకటి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా.. టైటిల్ కి తగ్గట్టు వసూళ్ల ఉప్పెన సృష్టించింది. ఏకంగా 100 కోట్ల మైలు రాయిని అందుకుంది. యూత్ ఫుల్ కాబట్టి... రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు. ఇప్పుడు ఓటీటీలోనూ ఈసినిమా హంగామా చేస్తోంది. ఈ సినిమాని ఇటీవల మా టీవీలో ప్రసారం చేశారు. తొలిసారి ఏకంగా 18.5 రేటింగ్ వచ్చింది. ఓ కొత్త హీరో సినిమాకి, ఓ కొత్త దర్శకుడి సినిమాకి ఈ స్థాయి రేటింగు రావడం.. నిజంగా రికార్డే.
ఇటీవల మా టీవీలో చాలా సినిమాల ప్రిమియర్ షోలు పడ్డాయి. దేనికీ రానంత రేటింగు ఉప్పెనకు వచ్చింది. అన్నట్టు ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లోనూ ప్రదర్శితం అవుతోంది. అక్కడ మాత్రం ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదని టాక్. ప్రేక్షకుల యందు.. బుల్లి తెర ప్రేక్షకులు, వెండి తెర ప్రేక్షకులు వేరని ఇంతకాలం తెలుసు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులూ వేరన్న సంగతి ఉప్పెన నిరూపించింది.