ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో `బొమ్మ బ్లాక్ బ్లస్టర్` అనిపించుకున్న సినిమా `ఉప్పెన`. 30 కోట్లతో రూపొందిన ఈ చిత్రానికి ప్రస్తుతం 50 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. దాదాపు ఫైనల్ రన్ 60 కోట్లకు ఫినిష్ అవ్వొచ్చు. అంటే... రూపాయికి రూపాయి లాభం అన్నమాట.
అయితే ఇప్పుడు వైష్ణవ్‌తేజ్, కృతి శెట్టికి ఎంతెంత పారితోషికాలు ఇచ్చారు? అనే ఆసక్తి కరమైన ప్రశ్న తలెత్తింది. ఇద్దరికీ ఇదే తొలి సినిమా. ఈ సినిమా బయటకు రాకుండానే.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ రకంగా చెప్పాలంటే, వీళ్లకు `ఉప్పెన`తోనే జీవితం మలుపు తిరిగింది. అలాంటప్పుడు పారితోషికం పెద్ద లెక్కకాదు. అయితే వైష్ణవ్ తేజ్‌కి రూ.50 లక్షల వరకూ ఇచ్చారని ఓ టాక్ వినిపిస్తోంది.
కృతి శెట్టికి ఇచ్చిందయితే... కేవలం ఆరు లక్షలే అట. దర్శకుడు బుచ్చిబాబు నెలవారీ జీతానికి పనిచేశాడని చెప్పుకుంటున్ఆరు. మొత్తానికి.. తొలి సినిమాకి ముగ్గురూ చీప్ గానే దొరికేసినట్టు. అయితే ఇప్పుడు వైష్ణవ్ ఏకంగా రెండు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట. కృతి పారితోషికం 50 లక్షల పైమాటే.