సెన్సేషనల్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది అలనాటి అందాల నటి ఊర్మిళ. అప్పట్లో వర్మకు ఆస్థాన హీరోయిన్గా ఊర్మిళ సూపర్ పాపులర్. తనదైన నటన, అదరగొట్టే గ్లామర్‌తో అప్పట్లో కుర్రకారుకు కెవ్వుకేక పుట్టించేసింది ఊర్మిళ. అలాంటి ఊర్మిళ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి, చాన్నాళ్లు రెస్ట్ తీసుకుంది.
లాస్ట్ ఇయర్ అనగా 2016 మార్చిలో ఊర్మిళ కాశ్వీర్కు చెందిన ఓ వ్యాపారవేత్తని పెళ్లాడి, లైఫ్‌తో సెటిలైపోయిందిక అనుకున్నారంతా. అయితే పెళ్లి తర్వాత చాలా మంది ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, సక్సెస్ అవుతున్నారు. అందుకే అదే బాటలో ఊర్మిళ కూడా మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుందట. అనుకున్నదే తడవుగా ఆమెకి ఓ గ్రాండ్ ఆఫర్ వచ్చింది. అయితే అది ఓ ఐటెం సాంగ్ ఆఫర్ కావడం, అందుకు ఊర్మిళ ఓకే చెప్పడం విశేషం.
అభినవ్ దర్శకత్వంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'బ్లాక్మెయిల్' చిత్రంతో ఊర్మిళ రీ ఎంట్రీ షురూ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత ఊర్మిళ ఐటెం సాంగ్‌లో నటిస్తుందా అని మొదట్లో చిత్ర యూనిట్ డౌట్ పడిందట. కానీ ఇంత గ్యాప్ వచ్చాక కూడా తనలోని గ్లామర్ ఫ్లేవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకే ఈ ఐటెం సాంగ్‌కి ఊర్మిళ సైన్ చేసి ఉండొచ్చుననిపిస్తోంది బహుశా.
సాంగ్‌లో ఊర్మిళ గ్లామర్ అంతలా కెవ్వుకేక పుట్టించేలా ఉంది మరి. రీ ఎంట్రీలో సీనియర్ భామలు సక్సెస్ అందుకుంటున్నట్లుగానే ఊర్మిళ కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలిక. అయితే ఊర్మిళ రీ ఎంట్రీ బోణీ చూస్తే, ఇప్పుడు కూడా ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలే ఎంచుకుంటుందా? లేక హుందా పాత్రలు కూడా ఎంచుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది.