విలక్షణ నటుడితో తెలుగమ్మాయ్‌!

మరిన్ని వార్తలు

రెగ్యులర్‌ హీరోయిజానికి దూరంగా, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు విజయ్‌ సేతుపతి. ఈయన తాజాగా తమిళంలో నటిస్తున్న చిత్రం 'సిందూబాద్‌'. ఈ సినిమాలో విజయ్‌సేతుపతికి జంటగా తెలుగమ్మాయి అంజలి నటిస్తోంది. అరుణ్‌ ఈ సినిమాకి దర్శకుడు. కాగా, ఈ సినిమాలో హీరోకి మన 'రంగస్థలం' చిట్టిబాబులా కాస్త చెవి సమస్య ఉంటుంది. గట్టిగా మాట్లాడితే కానీ, వినిపించదు. సౌండ్‌ ఇంజనీర్‌ అన్నమాట. కానీ, మన చిట్టిబాబులాగే కాస్త మొరటోడు. అయినా చాలా మంచోడు. ఈ మొరటోడికి భార్య పాత్రలో నటిస్తోంది అంజలి.

 

భార్య భర్తల మధ్య సాగే భావోద్వేగాల కథతో అందంగా, ఆశక్తికరంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కొడుకు సూర్య నటిస్తుండడం విశేషం. కాగా, విజయ్‌సేతుపతి మరోవైపు తెలుగులో కూడా సత్తా చాటుతున్నాడు. మెగా కాంపౌండ్‌లో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ డెబ్యూ ఇస్తున్న 'ఉప్పెన'లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అది విలన్‌ పాత్ర అయ్యుంటుందనీ, లేదు లేదు, సినిమాకి అత్యంత కీలకమైన హీరో తండ్రి పాత్రనీ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పాత్ర విభిన్నంగా ఉంటేనే కదా మనోడు ఒప్పుకునేది. సో అలా అటు తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే, ఇటు తెలుగులోనూ ఆశక్తికరమైన పాత్రలు పోషిస్తున్నాడు విజయ్‌సేతుపతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS