హేట్‌ స్టోరీ కాదది హాట్‌ స్టోరీ

By iQlikMovies - January 26, 2018 - 11:23 AM IST

మరిన్ని వార్తలు

'హేట్‌ స్టోరీ' సిరీస్‌లో నాలుగో సినిమా రాబోతోంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ హాట్‌ హాట్‌గా ఆడియన్స్‌ని అలరించేశాయి. వాటిల్లో కొన్ని సంచలన విజయాల్నీ అందుకున్నాయి. ఈసారి నాలుగో సినిమా అంతకు మించిన హాట్‌ అప్పీల్‌తో, బాక్సాఫీస్‌ వసూళ్ళను కొల్లగొట్టబోతోందట. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ నాలుగో 'హేట్‌ స్టోరీ'లో నటిస్తోంది. 

ఊర్వశి ఈ సినిమా కోసం కొంత బరువు పెరిగిన సంగతి తెల్సిందే. ఆ బరువు పెరగడం కూడా హాట్‌ అప్పీల్‌ని పెంచడం కోసమేనట. రేపే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కాబోతోంది. విశాల్‌ పాండ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చిలో ఈ 'హేట్‌ స్టోరీ - 4' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్‌ విడుదల డేట్‌ని అనౌన్స్‌ చేస్తూ తీసుకొచ్చిన స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరోయిన్‌ ఊర్వశి రౌతేలా బ్యాక్‌ని దాదాపుగా ఓపెన్‌ చేసేశారు. బ్యాక్‌ నుంచే ఇంత హాట్‌ అప్పీల్‌ చూపించేస్తోంటే, సినిమాలో ఇంకేం చూపించబోతున్నారోగానీ, సినిమాపై మాత్రం హాట్‌ హాట్‌గా అంచనాలు పెరిగిపోతున్నాయి. 

ఈ తరహా సినిమాలకి అందాల భామల అందాలే ప్రధాన ఆకర్షణ. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అనేవి ఎట్రాక్షన్‌ పరంగా సెకెండ్‌ ప్లేస్‌లోనే నిలుస్తాయి. అయినప్పటికీ కూడా, హాట్‌నెస్‌కి తోడు ఇంట్రెస్టింగ్‌గా ఆ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటే, ఇలాంటి చిత్రాలు ఇచ్చే విజయాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. 'మర్డర్‌' లాంటి సినిమాలు స్టార్‌ హీరోల సినిమాలకు వసూళ్ళ పరంగా షాక్‌ ఇచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం. భారీ చిత్రాలతో పోటీ పడి వసూళ్ళను సాధించే సత్త 'హేట్‌ స్టోరీ - 4'కి ఉందని చిత్ర దర్శక నిర్మాతలంటున్నారు. 

కేవలం ఎక్స్‌పోజింగ్‌ కోసమే తాను ఈ సినిమాలో కన్పించడంలేదనీ, అంతకు మించిన ఇంట్రెస్టింగ్‌ అంశాలు సినిమాలో చాలా ఉన్నాయని ఊర్వశి చెబుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS