బాలీవుడ్ అందాల భామ ఊర్వశీ రౌతెల్లా తన ప్రియమైన ఫాలోవర్స్ కోసం ఎప్పుడూ ఏదో ఒక అందాల ప్రక్రియ చేస్తూనే ఉంటుంది. అసలే లాక్‌డౌన్ వేళ.. సెలబ్రిటీలకు బోలెడంత టైమ్ కలిసొచ్చింది. మరోవైపు ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’ అంటూ తమ తమ ప్రియమైన సెలబ్రిటీల ఇన్‌స్టాలు, ట్విట్టర్స్ సెర్చ్ చేస్తూ నెటిజన్లు టైమ్ పాస్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం తన సహాయ సహకారాలు అందించడానికి మన ఊర్వశి పాప హాట్ హాట్‌గా గ్లామర్ రెసిపీస్‌ని మస్త్‌గా మసాలా దట్టించి మరీ సిద్ధంగా ఉంచుతోంది.
ఆ క్రమంలో లేటెస్ట్‌గా వదిలిన హాట్ హాట్ ఫోటోనే ఇది. బ్రైట్ మెజంతా కలర్ షార్ట్ అండ్ టైట్ మిడీ ధరించి వయ్యారంగా హొయలు పోయింది. డ్రస్ కలర్ బ్రైట్, స్కిన్‌కేమో టైట్.. ఇంకేముంది. కావల్సిన గ్లామర్ పండిపోవడంతో, ఈ హాట్ స్టిల్ కి సోషల్ మీడియాలో వేల కొద్దీ లైకులూ, కామెంట్లూ పోటెత్తేస్తున్నాయ్ మరి. ఇంకెందుకాస్యం మీరూ ఈ అందాల ఊర్వశిపై ఓ కన్నేయండిక.