ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా చెలామణీ అవుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రీసెంట్‌గా మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమాతో హిట్ కొట్టి, సత్తా చాటాడు. ఇక ఇప్పుడు ‘ఎఫ్ 3’ పనుల్లో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్ వేళ అనిల్ రావిపూడితో తాజాగా జరిపిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆశక్తికరమైన విషయాన్ని మనతో పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా ఉండబోతోందనేది ఆ ఆసక్తికరమైన అంశం. మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయాలన్నది అనిల్ రావిపూడి కలట. ఆ కలను త్వరలోనే నెరవేర్చుకుంటానంటున్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు, చిరంజీవి కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడట.
త్వరలోనే ఆ స్క్రిప్టును చిరంజీవికి వినిపిస్తానంటున్నాడు. ఆ కథ ఖచ్చితంగా చిరంజీవికి నచ్చుతుందనీ, నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. అయితే, అనిల్ రావిపూడి నమ్మకం సరే, కానీ, ప్రస్తుతం చిరంజీవి చాలా బిజీ. ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం కొంతమేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించాల్సి ఉంది. ఆ పై హరీష్ శంకర్‌తో ఓ సినిమా, త్రివిక్రమ్‌తో మరో సినిమా, సుకుమార్‌తో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. అన్నీ కుదిరితే, మరి అనిల్ రావిపూడి వంతు ఎప్పుడొస్తుందో చూడాలిక.