అందాల గని చేతికి తగిలిందా.? అల.. అతిలోక సుందరి ఇలపై వాలిందా.. అన్నట్లుండే అందం ఆమె సొంతం. 'ఆమె' ఎవరో కాదు, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా. 'హేట్‌స్టోరీ 4' సినిమాలో వేడి వేడి సొగసులారేసి, కుర్రాళ్లకు కేక పుట్టించింది. తాజాగా అందమైన అజంతా శిల్పంలా ముస్తాబై మన ముందుకొచ్చింది. సోషల్ మీడియాలో తాజాగా ఊర్వశి ఓ పిక్ పోస్ట్ చేసింది. అందమంతా ఇక్కడే పోగు పడిందా.? పారే నదికేం తెలుసు వంపుల వెల్లువ.. ఇదిగో ఇవీ వంపులంటే.? వీచే గాలికేం తెలుసు సుగంధపు ఘుమఘుమ.. ఇదిగో అందాల ఘుమఘుమ అంటే ఇదే, మెరిసే నక్షత్రాలకేం తెలుసు మెరుపుల విలువ.
ఊర్వశి అందంలోని జిగేల్‌దే అసలు మెరుపుల హవా.. అనిపించేంతలా ఉందీ పోజు. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించింది వంపులన్నీ ఆరేస్తూ నిలబడింది. హాఫ్ సైడ్ ఫుల్ లెంగ్త్‌లో ఉన్న డ్రస్, మరో వైపు మెరిసిపోతున్న స్కిన్ టోన్.. కాళ్లకు సిల్వర్ కలర్ హై హీల్, మ్యాచింగ్ మెటల్ చెవి పోగులు.. దేవుడా.. చూసేందుకు రెండు కళ్లే ఎందుకిచ్చావ్.. అనేలా ఉంది. మీరైతే, ఒళ్లంతా కళ్లు చేసుకుని ఈ అందాల్ని ఆస్వాదించాల్సిందే.