బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా, మోడలింగ్‌తోపాటు అందాల పోటీలు.. ఆ తర్వాత సినీ రంగం.. ఇలా రకరకాల ప్లాట్‌ఫామ్స్ పై సత్తా చాటింది, సత్తా చాటుతూనే వుంది. అయితే, సినీ రంగంలో ఇంకా ఆమెకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదేమో.! ఐటమ్ సాంగ్స్‌కీ, సెక్సీ స్పెషల్ రోల్స్‌కి మాత్రమే ఊర్వశి రౌతేలా పరిమితమవుతూ వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం ఊర్వశి చాలా యాక్టివ్‌గా వుంటోంది. పైగా, మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ వున్నారామెకి.
అలా ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో, ఈ కరోనా సీజన్‌లో ఇంకా రెచ్చిపోయి అందాల ఆరబోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సోషల్ మీడియా వేదికగా. ఆకుచాటు అందాల విందుని కనులారా ఆస్వాదించెయ్యడంలో కుర్రకారు వెనుకంజ వేస్తేందా.? సమస్యే లేదు. అలా కుర్రాళ్ళకు కిర్రాకు పుట్టించడమే ఊర్వశీ రౌతేలా ఉద్దేశ్యం. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ఆకుచాటు అందం ఆ అందాన్ని పుట్టించిన బ్రహ్మకే రిమ్మతెగులు పుట్టేలా చేస్తోందంటే అది అతిశయోక్తి ఎలా అవుతుందట.?