ఊర్వశీ రౌతెల్లా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘హేట్‌స్టోరీ 4’తో కుర్రకారును ఓ రేంజ్‌లో మైమరిపించిన హాట్ బ్యూటీ ఈ ముద్దుగుమ్మ. అందంలో మచ్చ లేని చందమామ. గ్లామర్‌లో ఈమెకి సాటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, స్క్రీన్‌పై సక్సెస్ మాట అటుంచితే, సోషల్ మీడియాలో అమ్మడికున్న హాట్ హాట్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఫస్ట్ మూవీతోనే తనలోని హాట్ యాంగిల్‌ని ఎర్ర తివాచీ వేసి పరిచేసిందీ పాప. సో ఆ మాత్రం ఫాలోయింగ్ లేకుంటే ఎట్టా మరి. అందుకే ఆ ఫాలోయింగ్‌ని మరింత క్యాష్ చేసుకునేలా రెగ్యులర్‌గా హాట్ హాట్ ఫోటో సెషన్స్ చేయించుకుంటూ వుంటుంది.
కరోనా వైరస్ కూడా ఊర్వశి అందాల విందును ఆపలేకపోయింది. చూస్తున్నారుగా, భీభత్సమైన భానుడి ప్రతాపాన్ని కూడా లెక్క చేయకుండా, టూ పీస్ బికినీలో ఎలా హీటు పుట్టిస్తోందో. కనుచూపు మేరలో నీరు తప్ప మరేదీ కనిపించడం లేధీ పిక్ లో. ఆ విశాలమైన సముద్రపు నీటితో తన అందాలను పోటీకి దించినట్లుగా ఉందీ అమ్మడి హాట్ పోజు. కరోనాకే కరోనా తెప్పించేలా లేదూ. అస్సలేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హాట్ హాట్ సొగసుల్ని తనివి తీరా చూసి ఆస్వాదించాల్సిందే.