బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా, ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటించనున్న విషయం విదితమే. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ఇదిలా వుంటే, ఊర్వశి రౌతెలా మరో తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే, హీరోయిన్‌గా కాదు. ఐటమ్ బాంబులా పేలేందుకోసం. ఊర్వశితో మాంఛి ఐటవ్‌ు సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నారట టాలీవుడ్‌లో. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మేరకు ఊర్వశిని అప్రోచ్ అవడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయట.
అయితే, ఏ సినిమా కోసం.? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా వుంటే ‘బ్లాక్ రోజ్’ సినిమా షూటింగ్‌ని చాలా వేగంగా పూర్తి చేసెయ్యాలనే సంకల్పంతో వున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. మరోపక్క, తెలుగు సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఊర్వశి, తెలుగులో మాట్లాడేందుకు కూడా ప్రయత్నిస్తోందట. తెలుగు కోసం ఓ ట్యూటర్‌ని కూడా పెట్టుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమాకి ఎలాగూ హీరోయిన్ల కొరత వుంది. ఆ కొరత కొంతవరకైనా తీర్చడానికి ఊర్వశి ఉపయోగపడుతుందేమో.
ఏమో, ఎవరు చెప్పగలరు.. అనూహ్యంగా ఊర్వశి రౌతెలాకి తెలుగులో స్టార్‌డమ్ దక్కుతుందేమో. తెలుగు సినిమాల సంగతి అలా వుంచితే, ఊర్వశి బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతోంది. ఇందులో సినిమాలతోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా వున్నాయి. ఊర్వశి ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.