జనసేన పార్టీ చీఫ్‌గా రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూనే, సినిమాల్లో మళ్ళీ నటించాలనే నిర్ణయం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. పవన్ నటిస్తున్న రెండు సినిమాలు అయోమయంలో పడ్డాయి. సమ్మర్‌లో రావాల్సిన ‘వకీల్ సాబ్’ కరోనా కారణంగా ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ‘వకీల్‌సాబ్’తోపాటు క్రిష్ డైరెక్షన్‌లో సినిమా కూడా షూటింగ్ ప్రారంభమయ్యింది. ఇంకోపక్క హరీష్ శంకర్‌తో సినిమానీ అనౌన్స్ చేసేశారు. ఈ మూడు సినిమాలతోపాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమాపైనా ఓ స్పష్టత వచ్చేసింది.
ఐదో సినిమాగా పవన్, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయొచ్చని అంటున్నారు. ఇక్కడితే, 2024 లోపు పవన్ చేసే సినిమాల లిస్ట్ ఆగిపోవచ్చని ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. వీలైనంత త్వరగా షూటింగులు పూర్తి చేసేస్తే, రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఆయా సినిమాల్ని రిలీజ్ చేయాలన్నది పవన్ కళ్యాణ్ ప్లానింగ్‌గా కన్పిస్తోంది. కానీ, కరోనా కారణంగా ఆ ఆలోచనలన్నీ ఇప్పుడు తారుమారైపోయే పరిస్థితి.
ఏదిఏమైనా, పవన్ మాత్రం ఐదు సినిమాలకంటే ఎక్కువ చేయకపోవచ్చట 2024 లోపల. ఆ ఐదు సినిమాలకీ వీలు కుదరకపోతే, హరీష్ శంకర్ సినిమాతోనే సరిపెట్టేయాలని కూడా పవన్ భావిస్తున్నట్లు సమాచారం. సినిమాలనేవి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే. రాజకీయం ప్రజా సేవ కోసం.. అన్న భావనతో వపన్ వున్నారట.