నటుడు, రచయతగా మంచి పేరుతెచ్చుకున్న ఉత్తేజ్ ఇప్పుడు తనలోని సామాజిక స్పృహని అందరికి పరిచయం చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే, ఉత్తేజ్ తను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ అవగాహన ప్రజల్లో పెంచడానికి తనవంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. తను ఉంటున్న ఏరియాలో రోడ్ల వెడల్పు సరిగా లేనందున డివైడర్స్ కావాలి అంటూ అధికారుల దృష్టికి సమస్యని తీసుకెళ్ళి అందులో విజయం సాదించారు.
అయితే ఆ డివైడర్స్ సిమెంట్ వి అవ్వడం వల్ల కూడా ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నందున ఆ డివైడర్స్ కి రేడియం స్టిక్కర్లు అలాగే ప్రమాద సూచికగా ఎర్ర జెండాలు కూడా ఏర్పాటు చేశాడు.
ఇక తన ప్రయత్నానికి ప్రజల సహాయం కూడా కావాలని అలా అయితేనే అందరు కోరుకున్న మార్పు సాధ్యపడుతుంది అని అన్నారు.