యూవీ క్రియేషన్స్. సాహో లాంటి బిగ్ బడ్జెట్ మూవీని అందించిన ప్రతిష్టాత్మక సంస్థ. ఇప్పుడు `జాన్` కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కుతోంది. అయితే అప్పుడప్పుడూ చిన్న సినిమాల్ని కూడా అందిస్తూ బ్యాలెన్స్ చేస్తోంది యూవీ. ఇప్పుడూ అంతే. చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే ఒకేసారి 5 చిన్న సినిమాల్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఓ రకంగా... బిగ్ బ్యానర్ చేస్తున్న బిగ్గెస్ట్ ఎక్స్‌పెర్‌మెంట్ ఇది. 2021లో యూవీ నుంచి దాదాపు 6 సినిమాలు రాబోతున్నాయి. అందులో ప్రభాస్ సినిమా ఒకటి. అది కాకుండా మరో 5 చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అనుష్కతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది యూవీ. కార్తికేయ, శర్వానంద్‌లతో చెరో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లబోతోంది. వీటితో పాటుగా మరో రెండు చిన్న సినిమాల స్క్రిప్ట్స్‌ని ఓకే చేసింది. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేయబోతోంది. దాంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లనూ రూపొందించాలన్న ప్లానింగ్స్‌లో ఉంది యూవీ. మొత్తానికి యూవీ క్రియేషన్స్ కొత్త టాలెంట్ కి వెన్నుదన్నుగా నిలుస్తోందన్నమాట. కరోనా కష్టకాలంలో అంతకంటే కావల్సింది ఏముంది?