ఆల‌స్యం విలువ ఆరు కోట్లు

మరిన్ని వార్తలు

ఓటీటీ ద్వారా విడుద‌లైన పెద్ద సినిమా `వి`. ఈ సినిమా ఫ‌లితాన్ని బ‌ట్టి - మ‌రిన్ని సినిమాలు ఓటీటీకి వెళ్లాలో, వ‌ద్దో నిర్ణ‌యించుకుందామ‌నుకున్నాయి. ఈ సినిమాని 33 కోట్ల‌కు కొన‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాయి. అమేజాన్ 33 కోట్ల‌కు ఈ సినిమాని కొన్న‌ద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇప్పుడు ఈ రేటు నిజ‌మా, కాదా? అనే అనుమానాలు వ‌స్తున్నాయి. మే నెల‌లోనే అమేజాన్ నుంచి ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చింది. అప్పుడు ఈ సినిమాని 33 కోట్ల‌కు అడిగింది వాస్త‌వ‌మే. కానీ.. అప్పుడు దిల్ రాజు, నానిలు ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

 

కానీ.. ఆ త‌ర‌వాత కూడా ప‌రిస్థితుల్లో మార్పు రాలేదు. ఎప్ప‌టికీ థియేట‌ర్లు తెర‌చుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో, ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వాల్సిన అగ‌స్యం ఏర్ప‌డింది. దాంతో.. అమేజాన్ తో మ‌ళ్లీ బేరాలు మొద‌ల‌య్యాయి. అయితే ఈసారి అమేజాన్ 27 కోట్లు మాత్ర‌మే ఆఫ‌ర్ చేసింద‌ట‌. దాంతో.. మ‌రో మార్గం లేక 27 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మేశారు. అదే.. అమేజాన్ అడిగిన‌ప్పుడే ఈ సినిమా ఇచ్చుంటే.. మ‌రో 6 కోట్లు మిగిలేవి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS