నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘వి’ నుండి ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో నాని విలన్‌గా నటిస్తున్న చిత్రమిది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొన్న రిలీజైన ‘మనసు మరీ మత్తుగా ఊగిపోతున్నదే..’ అనే లిరికల్ సాంగ్ నిజంగానే యూత్‌ని మత్తులో ఊగిపోయేలా చేసింది. తాజా సాంగ్‌లోనూ అలాంటి మత్తే దాగుంది.
సీతారామశాస్త్రి లిరిక్స్‌కి అమిత్ త్రివేది, శ్రియా ఘోషల్ గాత్రం తోడై, పాటను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇక వీడియోలో మేకింగ్ స్టిల్స్ చూపిస్తూ, సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. సుధీర్‌బాబు, నివేదా థామస్ మధ్య సాగే రొమాంటిక్ నేచర్‌కి, నాని విలనిజం కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్‌లోని లిరిక్స్ ఉన్నట్లనిపిస్తోంది. మీసాలు పైకి మెలేసి, విలన్ లుక్స్‌లో నాని చంపేస్తున్నాడు. పక్కింటబ్బాయ్లా, కూల్‌గా కామ్‌గా కనిపించే నానికి విలన్‌గా కనిపించాన్నది చిరకాల కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోందనిపిస్తోంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.