తెలుగులో 'ఆహా కళ్యాణం' అంటూ నేచురల్ స్టార్ నానితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ గుర్తుందా.? కొంచెం కష్టమేలెండి. అప్పుడెప్పుడో వచ్చిన ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. సో ఈ ముద్దుగుమ్మ కూడా పెద్దగా రిజిస్టర్ కాలేదు. పేరు వాణీ కపూర్. బాలీవుడ్ పోరి కదా, గ్లామర్ పుష్కలంగా ఒలకబోసేస్తుంది. గ్లామర్‌లో పుష్కలం ఉన్నా, ఆఫర్స్‌లో ఆ పాటి పుష్కలత లేకపోవడంతో, అమ్మడు రేస్‌లో వెనకబడిపోయింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది. సోషల్ మీడియానే కాదండోయ్. అప్పుడప్పుడూ బహిరంగంగా, మీడియాకిచ్చే ఇంటర్వ్యూస్‌లో కూడా అమ్మడు 'టాప్' లేపేస్తుందంతే.
ఆ రేంజ్లో హాట్నెస్ చూపిస్తుందన్న మాట. అందుకే వాణీకపూర్ని ఇంటర్వ్యూ చేయాలంటే, రిపోర్టర్స్కి కాస్త గుండె నిగ్రహం తప్పనిసరి. లేదంటే, అమ్మడి అందాల దాడికి అక్కడే హార్ట్ ఎటాక్ వచ్చి పడిపోతారు పాపం విలేఖర్లు. అందుకే వాణీని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే, మెంటల్‌గా పక్కా ప్రిపేర్ అయ్యి తమ మైకులూ, కెమెరాలతో రంగంలోకి దిగుతారు విలేఖరి మహాశయులు. ఇంతలా చెబుతున్నామంటే, అమ్మడి హాట్ టాలెంట్ ఈ పాటికే మీకు అర్ధమైపోయుంటుంది. ఇక తాజా పిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.. రెండు కళ్ల నిండా, నిండుగా చూసుకుని పండగ చేస్కోండంతే.