నాని నటించిన 'ఆహా కళ్యాణం'తో తెలుగు తెరంగేట్రం చేసిన వాణికపూర్ కి ఎట్టకేలకు 'వార్' చిత్రంతో మంచి హిట్ దొరికింది. ఆ సినిమా విజయంలో వాణి కపూర్ పాత్ర పెద్దగా లేకపోయినప్పటికీ.. ఆమెకు పబ్లిసిటీ పెద్ద స్థాయిలో లభించింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో రూపొందిన 'వార్' హిందీలోనే కాదు తెలుగులోనూ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది. దాంతో వాణీ కపూర్ పేరు కూడా మారు మ్రోగింది. అయితే ఆ పబ్లిసిటితో వాణీ సంతృప్తి పడడం లేనట్లుంది. అందుకే.. ఏరికోరి వివాదాన్ని కొని తెచ్చుకుంది.
'హే రామ్' అని ముద్రించి ఉన్న పొట్టి టి షర్ట్ కొనుక్కుని ధరించి వివాదానికి తెర తీసింది. వివాదం వీలైనంత పెద్దది అయ్యాక.. అప్పుడు సింపిల్ గా సారీ చెప్పాలని ఇప్పటికే ఫిక్స్ అయిపోయే ఉంటుంది. ఈలోపు లభించే ఫ్రీ పబ్లిసిటీని ఆస్వాదిస్తుంది అమ్మడు. యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఆశీస్సులు, ప్రోత్సాహం పుష్కలంగా కలిగిన వాణీకపూర్ ఎప్పుడూ ఎదో ఒక విధంగా వార్తల్లో ఉండాలని కోరుకుంటుంది. అందులో భాగంగా వీలైనంత తరచుగా అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి 'హే రామ్'ను జత చేసింది!!