'పెళ్లిచూపులు', 'శతమానం భవతి' వంటి చిత్రాలు ఓవర్సీస్‌లో సూపర్‌హిట్స్ అవడంతో రాబోయే చిన్న చిత్రాల్లో 'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషన్ క్రేజ్ వచ్చింది. అందుకే 'వైశాఖం' ఓవర్సీస్ రైట్స్ కోసం చాలామంది పోటీ పడ్డారు. అయితే ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి బ్లూ స్కై సంస్థ 'వైశాఖం' ఓవర్సీస్ రైట్స్ స్వంతం చేసుకోవడం బిజినెస్ సర్కిల్స్‌లో ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. నైజాం ఏరియాకి, ఆంధ్రా, సీడెడ్ ఏరియాలకు బయ్యర్స్ చాలామంది ఆఫర్స్ ఇస్తున్నారు. ఈమధ్యకాలంలో బిజినెస్‌పరంగా ఏ సినిమాకీ లేని క్రేజ్ 'వైశాఖం'కి రావడానికి కారణం జయ బి అందించిన 'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' అన్నీ బయ్యర్స్‌కి లాభాల్ని తెచ్చిపెట్టిన హిట్ సినిమాలు కావడమే. అలాగే ఆర్.జె. సినిమాస్ బేనర్‌లో సినిమా అంటే పబ్లిసిటీ విషయంలో కాంప్రమైజ్ అవకుండా పెద్ద స్థాయిలో చేస్తారన్న నమ్మకం బయ్యర్లందరిలో వుండడం వలన స్పీడ్‌గా బిజినెస్ అవుతోంది.