విశ్వంభరలో మరొక మెగా హీరో?

మరిన్ని వార్తలు

టాలీవుడ్  క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర కూడా చేరింది. చిరు నటించిన భోళా  శంకర్ భారీ డిజాస్టర్ కావటంతో విశ్వంభర మూవీ పై ద్రుష్టి పెట్టారు మెగా స్టార్. ఇందు కోసం గట్టిగా కసరత్తులు కూడా చేస్తున్నారు. వయసుకి మించి యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారని, డూప్ లేకుండా ఫైట్స్ చేస్తున్నారని సమాచారం. బింబిసారా సినిమాతో సూపర్ హిట్ సాధించి అందరి దృష్టిలో పడ్డ వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. స్టాలిన్ సినిమా తరవాత  త్రిష చిరు పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సిస్టర్ క్యారక్టర్స్ లో సురభి, తో పాటు ఇంకో ఇద్దరు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తోంది. 


ఈ మూవీకి సంభందించి మరొక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరుతో పాటు ఇంకొక మెగా హీరో కూడా  జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా  మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విశ్వంభరలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన తరవాత సరైన హిట్ లేక సతమవుతున్న వైష్ణవ తేజ్ కి ఈ ఆఫర్ మంచి ప్లస్ అవుతుందని మెగా ఫాన్స్ సంతోష పడుతున్నారు. వైష్ణవ్ కెరియర్ కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ అవసరం. ఇలాంటి  టైం లో చిరు సినిమాలో నటించటం మంచిదనే చెప్పోచ్చు. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేవరకు ఆగక తప్పదు. విశ్వంభర 2025 సంక్రాంతిబరిలో నిలవనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS