పవన్ కళ్యాణ్ తో తన నెక్స్ట్ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు క్రిష్ సడన్ గా యువ హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా ప్రారంభించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ సినిమా తిరిగి ప్రారంభించేందుకు మరో నాలుగైదు నెలలు పట్టే అవకాశం ఉండడంతో ఈ గ్యాప్ లో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో తక్కువ రోజుల్లో ఒక సినిమా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు.
నలభై రోజుల పాటు ఏకధాటిగా సాగే ఒక లాంగ్ షెడ్యూల్ లో సినిమా మొత్తం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారని సమాచారం. ఎక్కువ లొకేషన్లు, ఎక్కువ మంది నటీనటులు ఉంటే ఇంత తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయలేరనే సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా కథ ప్రకారం ఎక్కువ శాతం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరణ జరుపుతారట. దీనికోసం హైదరాబాద్ సమీపంలో ఉన్న వికారాబాద్ అటవీ ప్రాంతంలో అనంతగిరి హిల్స్ ఏరియాను ఎంచుకున్నారట.
ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడీగా బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్న్మెంమెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు.