మూడేళ్ల తరవాత... తన అభిమానుల ఆకలి తీర్చాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ గా పవన్ ని తెరపై చూసుకుని అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈసినిమాకి రికార్డు వసూళ్లు కట్టబెడుతున్నారు. పవన్ సినిమా అభిమానులకు నచ్చితే ఎలా ఉంటుందన్న విషయం వకీల్ సాబ్ మరోమారు నిరూపించింది.
అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆమేజాన్ ప్రైమ్ కి ఈ సినిమాని 30 కోట్లకు అమ్మేశారు. సినిమా విడుదలైన 15 రోజులకు ఓటీటీలో ప్రదర్శించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో.. ఈనెల 23న ఈ సినిమాని ఆమేజాన్ లో పెట్టేస్తున్నట్టు టాక్. వకీల్ సాబ్ విడుదలై... మూడు రోజులే అయ్యింది. ఈ మూడు రోజులూ వసూళ్లు బాగున్నాయి. సోమవారం నుంచి కూడా వసూళ్లు స్టడీగానే ఉండే అవకాశాలున్నాయి.
వచ్చే వారం ఎలాగూ కొత్త సినిమాలు లేవు. కాబ్టటి.. ఆ వారం కూడా వకీల్ సాబ్ నే దిక్కు. పెద్ద సినిమాలు ఓటీటీలో రావడానికి కనీసం 4 వారాల గ్యాప్ ఉండాలన్న విషయంపై నిర్మాతలు పట్టుపడుతున్నారు. అయితే ఈ నిబంధన ఒక్కో సినిమాకీ ఒక్కోలా ఉంది. వకీల్ సాబ్ కలక్షన్లు రెండో వారం కూడా.... జోరుగా ఉంటే.. అప్పుడు ఈ సినిమాని ఓటీటీలో ప్రదర్శించే విషయంలో నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది.