'కింగ్ మేక‌ర్‌'గా చిరంజీవి?

మరిన్ని వార్తలు

చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ఒప్పేసుకుంటున్నాడు. ఆచార్య పూర్త‌యిన వెంట‌నే `లూసీఫ‌ర్‌` రీమేక్ మొద‌లైపోతుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా.. ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. స‌త్య‌దేవ్ కి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ఈ చిత్రం కోసం ప‌లు పేర్లు ప‌రిశీల‌న‌లోఉన్నాయి. `రారాజు` అనే టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే... `కింగ్ మేక‌ర్‌`.

 

ఈ సినిమాకి తెలుగులోనే టైటిల్ పెడ‌దామ‌నుకుంటే రారాజుకి ఫిక్స్ అవుతారు. ఈ టైటిల్ తో ఇది వ‌ర‌కే ఓ సినిమా వ‌చ్చింది. అది కాస్త ఫ్లాప్ అయ్యింది. ఆ భ‌యాలు ఉంటే మాత్రం `కింగ్ మేక‌ర్‌`కి షిఫ్ట్ అవుతారు. ఈనెల‌లోనే ఆచార్య షూటింగ్ మొత్తం పూర్త‌య్యే అవ‌కాశాలున్నాయి. ఆ వెంట‌నే... లూసీఫ‌ర్ రీమేక్ మొద‌లైపోతుంది. ఈలోగానే టైటిల్, ఇత‌ర వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS