‘వకీల్‌సాబ్‌’ని ఢీ కొట్టే లాయర్‌ సాబ్‌ ఎవరంటే.!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతోన్న ‘వకీల్‌ సాబ్‌’ని ఢీ కొట్టే అపోజిట్‌ లాయర్‌ సాబ్‌గా వెర్సటైల్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్‌ కానున్నాయట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చాలా సినిమాలొచ్చాయి. కానీ, వాటిన్నింట్లోకీ, ‘బద్రి’ మూవీది ప్రత్యేకమైన స్థానం. ‘బద్రి’లో ‘నువ్వు నందా అయితే, నేను బద్రి.. బద్రినాధ్‌’ అంటూ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చెప్పే డైలాగ్‌, ఆ పవర్‌ని ఢీకొట్టే ప్రకాష్‌ రాజ్‌ నటన ఎప్పటికీ మర్చిపోలేం. అంతే పవర్‌ఫుల్‌గా ఈ సినిమాలో వీరిద్దరి మధ్యా వచ్చే సీన్లుంటాయట. పోటా పోటీగా వాదనలు జరిపే కోర్టు సీన్లు సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళతాయంటున్నారు.

 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాని మేలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ ‘పింక్‌’ రీమేక్‌ అయిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నట్లు ఇటీవల రిలీజైన ‘మగువా.. మగువా..’ సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS