‘ఆచార్య’కు హ్యాండిచ్చిన త్రిష.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి 152 వ చిత్రం ‘ఆచార్య’లో హీరోయిన్‌గా త్రిష ఎంపికైందంటూ వార్తలు వినిపించాయి. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కానీ, త్రిషను దాదాపు హీరోయిన్‌గా ఫిక్సయ్యారంతా. కానీ, లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే, త్రిష ఈ సినిమా నుండి తప్పుకుందట. ఇదేమీ గాలి వార్త కాదండోయ్‌. స్వయంగా త్రిషనే ఈ విషయం ధృవీకరించింది. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ‘ఆచార్య’ నుండి తప్పుకోవల్సి వస్తుందని త్రిష ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. అయితే, ఈ విషయమై చిత్ర యూనిట్‌ నుండి ఎలాంటి స్పందనా రాలేదింతవరకూ. మరోవైపు ఇన్నాళ్లూ హీరోయిన్‌ లేకుండానే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది ‘ఆచార్య’ మూవీ.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌బాబు ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ విషయం పైనా అఫీషియల్‌ క్లారిటీ రాలేదు. అంతేకాదు, ఈ పాత్రలో అల్లు అర్జున్‌, చరణ్‌ తదితర హీరో పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఒకదానిపై ఒకటి గాసిప్స్‌గా ఈ సినిమాపై గాలి వార్తలు పుట్టుకొస్తున్నాయి. కానీ, చిత్ర యూనిట్‌ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఏది ఏమైతేనేం, మెగాస్టార్‌తో జోడీకి నై నై అని హీరోయిన్‌ త్రిష అయితే, కన్‌ఫామ్‌ చేసేసింది. ఇక ఇప్పుడు మళ్లీ ‘ఆచార్య’ టీమ్‌ హీరోయిన్‌ వేట మొదలెట్టాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS