సెప్టెంబరు 2... పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. పవన్ కొత్త సినిమాలకు సంబంధించిన కబుర్లతో పాటు, వకీల్ సాబ్ టీజర్ కూడా రాబోతోందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే.. టీజర్ కటింగ్ పనులు మొదలైపోయాయని, వాటికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే... పవన్ పుట్టిన రోజుకి వకీల్ సాబ్ టీజర్ రావడం డౌటేనని తెలుస్తోంది. ఈ పుట్టిన రోజున `వకీల్ సాబ్` టీమ్... కేవలం పోస్టర్ తో సరిపెట్టే ఆలోచలో ఉందని సమాచారం. వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా 30 శాతం బాకీ వుంది. అది పూర్తయి, సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలీదు. అందుకే... ఇప్పుడే తొందర పడి టీజర్ విడుదల చేయడం ఎందుకని దిల్ రాజు భావిస్తున్నాడని తెలుస్తోంది. క్రిష్ సినిమా టైటిల్.. దాంతో పాటు హరీష్ శంకర్ సినిమాకి సంబంధించిన డిటైల్స్ ఈ పుట్టిన రోజున వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.