దిల్ రాజు ఓకే అన్నా... ప‌వ‌న్ ఒప్పుకోడు.

మరిన్ని వార్తలు

చిన్నా, పెద్దా అని తేడా లేదు. అన్ని సినిమాలూ ఓటీటీ వైపుకు చూస్తున్నాయి. అమేజాన్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ, ఆహా.. వీళ్లంతా కొత్త సినిమాల్ని ఎగ‌రేసుకుపోవ‌డానికి రెడీగా ఉన్నాయి. స్టార్లుంటే.. ఎంత డ‌బ్బైనా ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. అంతెందుకు.. `వ‌కీల్ సాబ్‌`కీ ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని టాక్‌. `వి` కంటే ముందుగానే ఈ ఆఫ‌ర్ పై అమేజాన్ ప్ర‌తినిథులు దిల్ రాజుతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని స‌మాచారం. దాదాపు 100 కోట్లు ఇవ్వ‌డానికి అమేజాన్ సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వంద కోట్లంటే టెమ్టింగ్ ఆఫ‌రే. కానీ.. దిల్ రాజు ఓకే చెప్ప‌లేదు.

 

ఎందుకంటే ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా. థియేట‌ర్లో విడుద‌లైతే ఆ రేంజే వేరు. అజ్ఞాత‌వాసి సినిమా ఫ్లాప్ అయినా.. దాదాపు 60 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్ట‌గ‌లిగింది. అదే సినిమా హిట్ట‌యితే... కొత్త రికార్డులు సృష్టించ‌వొచ్చు. థియేట‌రిల్ రిలీజ్ ద్వారా 100 కోట్లు సంపాదించ‌డం ఈ రోజుల్లో పెద్ద మేట‌రేం కాదు, ఒక వేళ ఆఫ‌ర్‌కి టెమ్ట్ అయి దిల్ రాజు ఒప్పుకున్నా, ప‌వ‌న్ నో చెప్పే ఛాన్స్ ఎక్కువ‌. ఎందుకంటే.. ఇది త‌న క‌మ్ బ్యాక్ మూవీ. చాలా కాలం త‌ర‌వాత త‌న సినిమా వ‌స్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో విడుద‌ల చేసి, ఈ సినిమాని కొంత‌మందికే అందుబాటులో ఉంచ‌డం, రిలీజ్ డే కిక్ ని పోగొట్ట‌డం ప‌వ‌న్‌కి ఇష్టం ఉండ‌దు.అందుకే ఈ ప్ర‌తిపాద‌న‌ని దిల్ రాజు మొగ్గ‌లోనే తుంచేశార‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS