వక్కంతం వంశీ-ఎన్టీఆర్ ల గ్యాప్ కి కారణమేంటి?

By iQlikMovies - May 04, 2018 - 15:31 PM IST

మరిన్ని వార్తలు

ఈరోజు విడుదలైన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో రచయతగా ఉన్న వక్కంతం వంశీ ప్రముఖ దర్శకుడిగా మారుతున్నాడు.

ఇక ఈ వార్తలోకి వెళితే, ఎన్టీఆర్ కి టెంపర్ చిత్రం సమయంలోనే వక్కంతం వంశీ ఒక స్టొరీ లైన్ చెప్పాడట. అయితే ఆ స్టొరీ లైన్ డెవెలప్ చేసి క్రమంలో వీరిరువురికి మధ్య కొన్ని అభిప్రాయబేధాలు తలెత్తాయిట! దీనితో ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టేసినట్టుగా వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు.

అయితే తాము ఈ అంశాన్ని ఎప్పుడో వదిలేసాము అని మీడియానే ఇంకా మోస్తున్నారు అని ఆయన సమాధానమిచ్చారు. మొత్తానికి తమ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు అని రచయత-దర్శకుడు వక్కంతం వంశీ స్పష్టం చేశాడు.

మరి వీరి కలయికలో భవిష్యత్తులో ఏదైనా చిత్రం వస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS