యంగ్‌ హీరోతో 'నా పేరు సూర్య' డైరెక్టర్‌?

మరిన్ని వార్తలు

రచయితగా బోలెడన్ని పాపులర్‌ చిత్రాలకు కథలందించిన వక్కంతం వంశీ మెగాఫోన్‌ పట్టి తెరకెక్కించిన చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. తొలి సినిమా అయినా కానీ భారీ బడ్జెట్‌తో, స్టార్‌ హీరోతో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కింది వక్కంతం వంశీకి. 

అయితే డైరెక్టర్‌గా తొలి సినిమా విడుదలకు ముందు పెంచిన అంచనాల్ని, విడుదలయ్యాక అందుకోకపోవడంతో, విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది వంశీకి. అయినా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి తప్ప. ఢీలా పడితే లాభం లేదనుకున్న వక్కంతం వంశీ డైరెక్టర్‌గా రెండో సినిమాకీ స్క్రిప్టు ప్రిపేర్‌ చేసే పనిలో ఉన్నాడట. అయితే ఈ సారి స్టార్‌ హీరో, భారీ బడ్జెట్‌ కాకుండా, ఓ యంగ్‌ హీరో కోసం కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని సిద్ధం చేశాడట. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందనీ తెలుస్తోంది. 

త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడట వక్కంతం వంశీ. అయితే వక్కంతం వంశీ డైరెక్షన్‌లో నటించబోయే ఆ యంగ్‌ హీరో ఎవరు? అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంది. అయితే ఆ వివరాలు త్వరలోనే చెబుతానంటున్నాడు వక్కంతం వంశీ. ఆల్రెడీ ఆ యంగ్‌ హీరోకి స్టోరీ లైన్‌ వినిపించాడట వంశీ. స్క్రిప్టు నచ్చడంతో సదరు హీరో వక్కంతం వంశీతో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాడనీ తెలుస్తోంది.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS