వాల్మీకి.. 'ప్రీ' టీజ‌రే ఇలా ఉంటే...?

మరిన్ని వార్తలు

హ‌రీష్ శంక‌ర్ స్టామినా ఏంట‌న్న‌ది 'గ‌బ్బ‌ర్ సింగ్‌'తో తేలిపోయింది. 'డీజే'లో కూడా మాస్ మంత్రం జ‌పించాడు. ఇప్పుడు 'వాల్మీకి'లోనూ అదే పంథాలో వెళ్ల‌బోతున్నాడు. 'జిగ‌డ్తాండ‌' చిత్రాన్ని 'వాల్మీకి'గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. 14 రీల్స్ సంస్థ తెర‌కెక్కించింది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల కాబోతోంది. ఈలోగా 'ప్రీ టీజ‌ర్‌' ఒక‌టి వ‌దిలారు. అందులో వ‌రుణ్ మాసీ లుక్స్ కిర్రాక్ పుట్టిస్తున్నాయి. గెడ్డం, తీక్ష‌ణ‌మైన క‌ళ్లు, చేతిలో రివాల్వ‌ర్ ప‌ట్టుకున్న ఈ న‌యా వాల్మీకి కొత్త‌గా క‌నిపిస్తున్నాడు.

 

'ప్రీ టీజర్‌'లోనే ఇలా ఉంటే - టీజ‌ర్‌లో ఇంకేం చేస్తాడో, వ‌రుణ్‌ని హ‌రీష్ శంక‌ర్ ఎలా చూపిస్తాడో అన్న ఆస‌క్తి నెల‌కొంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. మిక్కీకి క్లాస్ ట‌చ్ ఉన్న సంగీత ద‌ర్శ‌కుడ‌ని పేరుంది. కానీ ఈ టీజ‌ర్‌కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే మిక్కీలో కొత్త యాంగిల్ బ‌య‌ట‌కు రానున్న‌దేమో అనిపిస్తోంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌రు 6న విడుదల చేస్తున్నారు.

ALSO READ : Valmiki Pre Teaser


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS