చాలా కాలం తరువాత మెగా ఫోన్ పట్టుకున్న సీనియర్ డైరెక్టర్ వంశీకి ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్ చిత్రం ద్వారా చేదు అనుభవం ఎదురయింది.
అయితే ఈసారి వంశీ ఒక థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఆ సినిమాకి కుడా చాలా వెరైటీ టైటిల్ పెట్టడానికి సిద్ధం అయ్యాడు. ఆ టైటిల్ విన్న ప్రతి ఒక్కరు నిజంగా ఇది వింత టైటిల్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకి ఆ టైటిల్ ఏంటి అంటే- స్ట్రెయిట్ వెళ్ళి.. రైట్ తీసుకో... అసలు వంశీ ఫ్యాషన్ డిజైనర్ సినిమాకి ముందు ఈ థ్రిల్లర్ ని తెరకేక్కిద్దామనుకున్నాడట. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్య పడలేదు అని తెలిసింది.
మరి ఈ స్ట్రెయిట్ వెళ్ళి.. రైట్ తీసుకో.. చిత్రం ఆయన కెరీర్ ని రైట్ డైరెక్షన్ వైపుకి తిప్పుతుందో లేదో చూడాలి.