ట్విట్టర్లోకి వచ్చాక చిరంజీవి రెచ్చిపోతున్నాడు. తన ట్వీట్లతో... కొత్తగా అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడు. ప్రతీరోజూ... చిరు నుంచి ఏదో ఓ ట్వీట్ కనిపిస్తూనే ఉంది. తాజాగా త్రిష పుట్టిన రోజు సందర్భంగా చిరు ఓ ట్వీట్ చేశారు. అందులో పెద్దగా విశేషం ఏమీ లేదు. త్రిషకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారంతే. దానికి బదులుగా త్రిష కూడా కృతజ్ఞతలు తెలియజేసింది.
చిరంజీవి - కొరటాల శివ సినిమా `ఆచార్య`లో త్రిషని కథానాయికగా ఎంచుకోవడం, ఆమె చివరి క్షణాల్లో తప్పుకోవడం, ఆ స్థానంలో కాజల్ వచ్చి చేరడం తెలిసిన విషయాలే. త్రిష సడన్ గా తప్పుకోవడం వల్ల ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మెగా అభిమానులు సైతం కినుక వహించారు. త్రిష తప్పుకోవడం వెనుక రక రకాల కారణాలు బయటకు వచ్చాయి. త్రిష విషయంలో చిరంజీవి సీరియస్‌గా ఉన్నాడని సైతం.. అనుకున్నారు. అయితే తాజా ట్వీట్‌తో అలాంటివేం లేవని తేలిపోయిది. ఉన్నా - సద్దుమణిగి ఉంటాయని అర్థమైంది. కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో త్రిష పట్ల ఫ్యాన్స్ లోనూ పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేశాడు చిరు. ఆయన పక్కా పాజిటీవ్ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి???