రేపటితో 62వ వడిలో అడుగుపెట్టనున్న మెగా స్టార్ చిరంజీవి తన పుట్టినరోజు కానుకగా, 151వ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు విడుదల చేయనున్నాడు.
అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. సరిగ్గా రేపు ఉదయం 11.30లకు ఈ ఫస్ట్ లుక్ అభిమానుల ముందుకి రానుంది. ఇక ఈ ఫస్ట్ లుక్ ని రాజమౌళి విడుదల చేయనుండడం అభిమానుల్లో అంచనాలని పదింతలు చేస్తున్నది.
మొత్తానికి ఈ మెగా ఫస్ట్ లుక్ కి ఒక మెగా టచ్ దర్శకుడు రాజమౌళి ఇవ్వనున్నాడు.