'వరలక్ష్మీ'.. ఈ సారి రౌడీ కాదు, హీరోయిన్ !

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమలో అన్ని ఉన్నా.. అదృష్టం అనే ఐటమ్ లేకపోతే అవకాశాలు రావనేది సినీ జనం ఎప్పుడూ చెప్పే రొటీన్ డైలాగ్. డైలాగ్ రొటీన్ అయినా.. కొంతమందిని చూస్తే ఈ మాట నిజమేనేమో అనిపిస్తోంది. 'వరలక్ష్మీ శరత్‌కుమార్‌'.. ఒక హీరోకి కూతురు. ఆ విషయం పక్కన పెడితే.. హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా పక్కా గ్లామర్ బ్యూటీ. అయినా ఎందుకో హీరోయిన్ గా మాత్రం ఈ టాల్ బ్యూటీ బిజీ కాలేకపోతుంది.

 

ఇండస్ట్రీ నుండి బలమైన సపోర్ట్ ఉన్నా.. ఇన్నాళ్లూ ఎక్కువుగా చిన్న సినిమాలకు అలాగే సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వచ్చింది. పోనీ ఆ సినిమాలైనా ఆ క్యారెక్టర్స్ అయినా, ప్రాముఖ్యత ఉన్నవా అంటే.. ఎదో చిన్న చితక చిత్రాల్లో ఏదో కాసేపు కనిపించే రెగ్యూలర్ క్యారెక్టర్స్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మికి మాస్‌ మహారాజా సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.

 

ర‌వితేజ - గోపీచంద్ మ‌లినేని కలయికలో తెరకెక్కనున్న "క్రాక్" లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా వరలక్ష్మీ కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా ఆడిపాడనుంది. అవును వరలక్ష్మి పాత్ర కూడా శ్రుతి హాసన్ పాత్రకు దీటుగా ఉంటుందట. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలెట్ అవ్వనుందట. మొత్తానికి రౌడీ పాత్రలకే పరిమితం అయిన వరలక్ష్మికి హీరోయిన్ గా మంచి రోల్ రావడం విశేషమే. ఇక ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా నటించనున్నాడు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి 'వరలక్ష్మీ శరత్‌కుమార్‌' ఈ సినిమాతోనైనా రెగ్యులర్ హీరోయిన్ గా సెటిల్ అవుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS