నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం `వరుడు కావలెను`. రీతూ వర్మ కథానాయిక. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. చిత్రీకరణ పూర్తయ్యింది. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరుడు కావలెను టీజర్ విడుదలైంది. 30 ఏళ్లు వచ్చేసినా పెళ్లి కాని అమ్మాయిగా రీతూ కనిపిస్తోంది. తన క్యారెక్టర్ ని చాలా టిపికల్ గా డిజైన్ చేశారు. అందం - పొగరు కలబోసిన కాంబినేషన్ ఆమెది. ఇక హీరో నాగశౌర్య బాగా సాఫ్ట్. వీళ్లిద్దరికీ ఎలా కుదిరిందన్నదే కథ. టేకింగ్, విజువలైజేషన్ అంతా బాగుంది.
ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగింది. ఇక వెన్నెల కిషోర్ పంచ్‌లు అయితే బాగా పేలాయి. `మీ బాసేంటి భయ్యా.. ఎడారిలో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు` ఎవ్రి బాల్ సిక్స్ కొట్టే బాట్స్‌మెన్ ని చూశావా... మా వాడు కొడతాడు ప్రతీ బాలూ నోబాల్ ఇచ్చే ఎంపైర్ ని చూశావా... ఆవిడ ఇస్తుంది.. - లాంటి ఫన్నీ డైలాగులు బాగున్నాయి. ఇటీవల దిగు దిగు దిగునాగ అనే ఫోక్ సాంగ్ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ రకంగా మ్యూజికల్ గానూ ఈ సినిమా బాగున్నట్టే. మొత్తానికి నాగశౌర్య ఖాతాలో మరో హిట్టు పడబోతోందన్నమాట.