సెల్ఫీలు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి అని ఈ మధ్య మనం తరుచు వింటూనే ఉన్నాం, పైగా వీటికి సంబంధించి అనేక సంఘటనలు కూడా నమోదు అవుతూనే ఉన్నాయి.
అయితే తన అభిమాని కోసం సెల్ఫీ తీసాడు అని ముంబై పోలీసులు హీరో వరుణ్ ధావన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, ముంబైలో నిన్న ట్రాఫిక్ లో ఒక అభిమానికి తన కారులో అద్దం దింపి బయటకి తలపెట్టి సెల్ఫీ ఇవ్వడం ఆ సమయంలో ఆ అభిమాని కూడా తన ఆటో నుండి బయటకి తలపెట్టి ఫోటో దిగడం ముంబై ట్రాఫిక్ పోలీసులకి ఆగ్రహం తెప్పించింది.
ఇలా చేయడం ప్రజాదరణ పొందిన మీలాంటి నటులకి తగదు అంటూ జరిమానా కూడా విధించింది. దీనికి వరుణ్ స్పందిస్తూ- తన కారు ఆగి ఉన్న సమయంలోనే ఈ సెల్ఫీ తీసినట్టు చెబుతూ ఇక పై ఇలాంటివి పునరావృతం కానివ్వను అని చెప్పాడు.
మొత్తానికి సెల్ఫీ తో ఈ స్టార్ హీరో కి చుక్కలు కనపడ్డాయి..