గత 19 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఇంతవరకూ రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. 15 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ అయిన బిగ్‌బాస్ షో నుండి ఇద్దరు బయటికి వెళ్లారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా లోపలికి వెళ్లింది. అలా 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రస్తుతం బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక మూడో ఎలిమినేషన్‌కి టైమొచ్చింది. ఈ వీకెండ్ మరొకరు హౌస్ నుండి బయటికి రావల్సి ఉంది. రాహుల్ సిప్లిగంజ్, వితికా షెరు, తమన్నా, బాబా భాస్కర్, పునర్నవి.. ఈ ఐదుగురు ప్రస్తుతం నామినేషన్స్‌లో నిలిచారు.
అయితే, వీరి నుండి తమన్నా ఈ వారం బయటికి రావల్సిందే అనే సంకేతాలు అందాయి మొదట్లో. కానీ, ఆ థాట్‌ని డైవర్ట్ చేసేందుకు హౌస్‌లోని వితికా షెరు ప్రవర్తిస్తోంది. రోజులు కౌంట్‌డౌన్ చేస్తూ, ఈ సారి వెళ్లిపోయేది నేనే.. అంటూ భర్తతో గారాలు పోతోంది. రొమాన్స్ ఎక్కువ చేస్తోంది. మొదట్లో చాలా స్ట్రాంగ్ అన్నట్లుగా కనిపించిన వితికా ప్రతీ చిన్న విషయానికి భయపడుతున్నట్లుగా బిహేవ్ చేస్తోంది.
ఇదంతా ఎందుకు.. అంటే, ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్లేది తానే.. అని ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేసేందుకే అని తెలుస్తోంది. కానీ, రాహుల్, పునర్నవి, వితికా షెరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదని మహేష్ విట్టా గ్రూప్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమన్నాని కానీ, బాబా భాస్కర్‌ని కానీ బయటికి పంపిస్తారని ఈ గ్రూప్ అభిప్రాయపడుతోంది. చూడాలి మరి, హౌస్ నుండి ఈ వారం బయటికి వచ్చేదెవరో.