'రణరంగం'లో చందమామకు సీన్‌ అంతేనా?

మరిన్ని వార్తలు

చందమామ కాజల్‌ అగర్వాల్‌ త్వరలో 'రణరంగం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కాజల్‌తో పాటు, కళ్యాణీ ప్రియదర్శిన్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, కళ్యాణీకే ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉంటుందట. కాజల్‌ పాత్రకు చాలా తక్కువ నిడివి ఇచ్చారట. అది తెలిసే కాజల్‌ ఈ సినిమాని ఒప్పుకుందట.

 

సీనియర్‌ అయినా, హీరోయిన్‌గా నిడివి తక్కువ పాత్రను అంగీకరించేందుకు ఒకే ఒక్క కారణముందని కాజల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సుధీర్‌ వర్మ తనకు నచ్చిన డైరెక్టర్‌ అనీ, ఆయనతో కలిసి వర్క్‌ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాననీ, ఆ కోరిక 'రణరంగం'తో తీరనుందనీ కాజల్‌ చెప్పింది. అందుకే ఆయన అడగ్గానే వెంటనే ఈ క్యారెక్టర్‌కి ఓకే చేశాననీ కాజల్‌ చెప్పింది. అంతేకాదట. ఈ కాంబినేషన్‌లో త్వరలోనే ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా మరో సినిమా చర్చల దశలో ఉందనీ కాజల్‌ వెల్లడించింది. ఇటీవల విడుదలైన 'రణరంగం' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 15న 'రణరంగం' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS