కెప్టెన్‌గా వరుణ్‌ : అలా గట్టెక్కించారా?

మరిన్ని వార్తలు

ఈ వారం బిగ్‌బాస్‌ ఎలిమినేషన్స్‌లో వరుణ్‌ సందేశ్‌ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్‌తో పాటు, వితిక పేరు కూడా ఉంది. అయితే, ఈ ఇద్దరూ ఎలిమినేషన్స్‌లో ఉంటే, ఓట్లు చీలిపోయే అవకాశముంది. అందుకే కావాలనే ప్లాన్‌ చేసి, వరుణ్‌ని తప్పించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ వరుణ్‌ ఎలిమినేషన్‌ నుండి ఎలా తప్పుకుంటాడా.? అనే అనుమానం వచ్చినవారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.

 

కెప్టెన్‌ అయిన వారికి ఒక వారం ఎలిమినేషన్‌ నుండి మినహాయింపు ఉంటుంది. ఇదీ బిగ్‌బాస్‌ రూల్‌. అలా ఈ వారం వరుణ్‌ని కెప్టెన్‌ చేసి, ఎలిమినేషన్‌ నుండి తప్పించారు. సో అలా వరుణ్‌, వితికల్లో ఇద్దరికి పడే ఓట్లు మొత్తం వితకకే పడడంతో, ఎలిమినేషన్‌ నుండి ఆమె కూడా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

 

సోషల్‌ మీడియాలో వరుణ్‌, వితికలకు ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. అఫ్‌కోర్స్‌, హౌస్‌లో ఉన్నవారందరికీ స్పెషల్‌ టీమ్‌ ఫాలోయింగ్‌ ఉందనుకోండి. అయితే, రీల్‌ హీరో, హీరోయిన్సే కాకుండి, ఇప్పుడు బిగ్‌హౌస్‌ హీరో, హీరోయిన్స్‌ కూడా కావడంతో మిగతా వారితో పోల్చితే వీరికి ఇంకాస్త ఎక్కువ క్రేజ్‌ ఉందంతే. మొత్తానికి కెప్టెన్సీతో వరుణ్‌ ఈ వారం ఎలిమినేషన్‌ నుండి భలే గట్టెక్కేశాడులే.

ALSO READ : Rakshasudu Review


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS