ఇందువ‌ద‌న టీజ‌ర్‌: ఘోస్ట్ హౌస్‌లో వ‌రుణ్ సందేశ్‌

By iQlikMovies - August 04, 2021 - 13:27 PM IST

మరిన్ని వార్తలు

హ్యాపీడేస్‌, కొత్త బంగారులోకం సినిమాల‌తో ఒక ఊపు ఊపేశాడు వ‌రుణ్ సందేశ్‌. అప్ప‌ట్లో ల‌వ్ స్టోరీల‌కు త‌నే కేరాఫ్ అడ్ర‌స్స్. అయితే... వ‌రుస ఫ్లాపుల‌తో ఆ గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. కొన్నాళ్లు వ‌రుణ్ ఎవ‌రికీ క‌నిపించ‌లేదు కూడా. చాలా కాలం గ్యాప్ త‌ర‌వాత `ఇందువ‌ద‌న‌` అనే సినిమా చేశాడు. ఇందులో వ‌రుణ్ లుక్ కొత్త‌గా క‌నిపిస్తోంది. ఇది వ‌ర‌క‌టి.. ల‌వర్ బోయ్ ఇమేజ్ ని చెరిపేసే ప్ర‌య‌త్నంలో వ‌రుణ్ క‌నిపిస్తున్న‌ట్టు. స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

ఇదో పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ. 1980ల నాటి క‌థ‌. కొన్ని రొమాంటిక్ షాట్స్‌.. ఆ త‌ర‌వాత యాక్ష‌న్ సీన్స్‌.. చివ‌ర్లో హార‌ర్ ఎటిమెంట్స్ తో సాగిపోయింది టీజ‌ర్‌. మొత్తానికి.. ఇదో... ఘోస్ట్ హౌస్ లో జ‌రిగే క‌థ అని అర్థ‌మైంది. త‌న ప్రియుడికి జ‌రిగిన అన్యాయాన్ని తీర్చుకోవ‌డానికి ఓ ప్రేయ‌సి... ఆత్మ రూపంలో వ‌స్తే ఎలా ఉంటుందో చెప్పే క‌థ ఇది.

 

వ‌రుణ్ కి ఇది డిఫ‌రెంట్ స్టోరీనే. కాక‌పోతే.. ఈమ‌ధ్య హార‌ర్ సినిమాల‌కు బాగా క్రేజ్ త‌గ్గిపోయింది. అస‌లు ఈ జోన‌ర్ ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అలాంటి జోన‌ర్ తో మెప్పించాలంటే వ‌రుణ్ అద్భుతాలు చేయాల్సిందే. ఈ సినిమా క‌ల‌ర్‌, టోన్‌, అందులో వ‌రుణ్ గెట‌ప్పులు భిన్నంగా క‌నిపిస్తున్నాయి. క‌థ‌లోనూ ఆ న‌వ్య‌త ఉంటే వ‌రుణ్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభం అయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS